భారత్‌లో 12 గంటల్లో 131 కరోనా పాజిటివ్‌ కేసులు

  • కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన
  • దేశంలో 1965కి చేరిన కరోనా కేసుల సంఖ్య
  • కోలుకున్న 151 మంది 
  • 50 మంది మృతి
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. 12 గంటల్లో దేశంలో 131 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1965కి చేరిందని చెప్పింది. 1764 మంది కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 151 మంది కోలుకోగా, 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, రాజస్థాన్‌లో కొత్తగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 129కి పెరిగాయి. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 12 మందికి కరోనా సోకింది. కరోనా బాధితుల సంఖ్య 98కి చేరింది. అసోంలో మరో మూడు కొత్తకేసులతో 16కి పాజిటివ్‌ కేసులు చేరాయి. మణిపూర్‌లో కరోనా కేసులు రెండుకు చేరాయి.


More Telugu News