Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి

Indian Army vehicle falls into valley four soldiers dead
  • జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
  • 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం
  • గాయపడిన సైనికులు మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు.

ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో 17 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం సంభవించింది. లోయలో సుమారు 200 అడుగుల లోతులోకి వాహనం పడిపోయింది. హై ఆల్టిట్యూడ్ పోస్టు వద్దకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆర్మీతో పాటు పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని ఉదంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. 
Indian Army
Doda accident
Jammu and Kashmir
Army vehicle accident
Indian Army soldiers
Road accident India
Chamba-Bhaderwah highway
Udhampur Military Hospital

More Telugu News