KCR: తెలంగాణ గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

CM KCR and Minister Eetal met Governor Tamilisye
  • రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్
  • కేసీఆర్ తో పాటు మంత్రి ఈటల, ఇతర శాఖల అధికారులు
  • ‘కరోనా’ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన కేసీఆర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని సీఎం కేసీఆర్ ఈరోజు కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు ఈరోజు సాయంత్రం కేసీఆర్ సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెల్త్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి  ఇతర ఉన్నతాధికారులు వెళ్లారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల గురించి,  వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి గవర్నర్ కు వివరించినట్టు సమాచారం.
.
KCR
TRS
Telangana
Tamilisai Soundararajan
Governor
Etela Rajender

More Telugu News