Pawan Kalyan: తెలంగాణ గవర్నర్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు

Pawan kalyan praises Telangana Govener
  • రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లోని పేద కూలీలకు ఆహారం తయారు చేయించిన తమిళిసై
  • ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టు చేసిన గవర్నర్
  • పవన్ స్పందనపై ‘థ్యాంక్యూ’ అంటూ గవర్నర్ సమాధానం
లాక్ డౌన్ ప్రభావంతో రోజు వారీ కూలీ పనులు చేసుకునే వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉండే పేద కూలీల కోసం ఆహార పదార్థాలను వారికి అందిస్తున్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి కష్ట సమయంలో ఆమె చేస్తున్న పని అద్భుతమని కొనియాడుతూ ఓ ట్వీట్ ద్వారా పవన్ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై గవర్నర్ స్పందిస్తూ, ‘థ్యాంక్యూ’ చెప్పారు.
Pawan Kalyan
janasena
Tamilisai Soundararajan
Governor
Telangana

More Telugu News