Andhra Pradesh: ఏపీలో 12 గంటల్లో 43 మందికి కరోనా నిర్ధారణ.. 87కి చేరిన కేసులు

coronavirus cases in ap

  • 12 గంటల్లో మొత్తం 373 శాంపిళ్ల పరీక్ష
  • కడపలో అత్యధికంగా 15 కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 మధ్య 43 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 87కి చేరింది. 12 గంటల్లో మొత్తం 373 శాంపిళ్లను పరీక్షించగా, వాటిల్లో 330 నెగిటివ్‌గా తేలింది.

ఈ 12 గంటల్లో కడపలో అత్యధికంగా 15, పశ్చిమ గోదావరిలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ సర్కారు విడుదల చేసింది. కరోనా నుంచి ఏపీలో ఇప్పటివరకు మొత్తం ఇద్దరు కోలుకున్నారు.          

               

  • Loading...

More Telugu News