PM-cares: పీఎం-కేర్స్‌కు మిట్టల్‌ గ్రూప్‌ భారీ విరాళం: రూ.100 కోట్లు ప్రకటన

mittal group donate 100 crores to PM cares
  • ఈ మేరకు ప్రకటన చేసిన లక్ష్మీనివాస్‌ మిట్టల్‌
  • స్టీల్‌, హెచ్‌ఎంఈఎల్‌ సంస్థల తరపున వితరణ
  • కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది
కరోనా కట్టడికి పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఈ కష్టకాలంలో అండగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తించి తమ గ్రూపు తరపున వంద కోట్ల రూపాయల విరాళం పీఎం-కేర్స్‌కు అందజేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీనివాస్‌మిట్టల్‌ వెల్లడించారు. తమ సంస్థలైన ఆర్సెలార్‌ మిట్టల్ నిప్పన్‌ స్టీల్‌, హెచ్‌ఎంఈఎల్‌ సంస్థల తరపున ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ రోజూ 35 వేల మందికి ఆహారం అందజేస్తోందని గుర్తు చేశారు. కోవిడ్‌19ను జయించేందుకు భారత ప్రజలు ఎనలేని తెగువతో పోరాడుతున్నారని, ఇటువంటి సమయంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
PM-cares
Mittala group
Corona Virus
100 crores

More Telugu News