Amala Paul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

 *  మణిరత్నం సినిమాలో అవకాశం అంటే ఎవరైనా సరే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తారు. అయితే, ప్రస్తుతం ఆయన తీస్తున్న పొన్నియన్ సెల్వం' చిత్రంలో నటించడానికి మాత్రం అమలాపాల్ తిరస్కరించింది. దీని గురించి తాజాగా ఆమె చెబుతూ, 'నాకు సూట్ అవ్వని పాత్రను చేయడం కన్నా వదిలేసుకోవడం మంచిదని భావించాను. ఒకవేళ అలాంటిది చేస్తే రేపు అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే మణిసార్ చిత్రాన్ని వదులుకున్నాను. ఆయన సినిమాలో నటించే అవకాశం మరోసారి వస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పింది.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ యూరప్ లో జరగాల్సి వుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఆ షెడ్యూల్ ను రద్దు చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ తీసేసిన తర్వాత ఆ షెడ్యూల్ ను కూడా ఇక్కడే తగిన సెట్స్ వేసి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
*  మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోలో రూపొందే చిత్రంలో హీరోయిన్ పాత్రకు కొత్తగా ఇప్పుడు కైరా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. నిన్నటి వరకు కీర్తి సురేశ్ ఇందులో నటిస్తుందంటూ వార్తలు రాగా ఇప్పుడు కైరా పేరు కూడా రావడం విశేషం.
Amala Paul
Mani Rathnam
Prabhas
Mahesh Babu

More Telugu News