చరణ్ పాత్రలపై పెయింటింగ్ పోటీలకు గడువు పొడిగింపు
- చరణ్ పాత్రలపై చిత్రకళా పోటీలు
- చిత్రకారులను ప్రోత్సహించే కార్యక్రమం
- ఉత్తమ పెయింటింగుకు చిరు సత్కారం
చిత్రకారులలో వున్న నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని మరియు అభిమానుల్లో అంతర్గతంగా వున్న కళాశక్తిని వెలికితీసేందుకు ఈ చిత్రకళా పోటీలను తలపెట్టారు. ఆసక్తి కలిగిన చిత్రకారులు చరణ్ పాత్రలపై తాము గీసిన చిత్రాలను ఆయన పుట్టినరోజు నాటికి పంపించమని ముందుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువును ఏప్రిల్ 18నాటికి పొడిగించారు. అభిమానులు గీసిన చిత్రాలను ramcharanbirthday@yahoo.comకు పంపించవలసిందిగా కోరారు. ఉత్తమ పెయింటింగుకు చిరు సత్కారం ఉంటుందని తెలియజేశారు.