Ambati Rambabu: ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేయడం తగదు: అంబటి ఆగ్రహం

Ambati Rambabu lashes out Chandrababu
  • ప్రస్తుత తరుణంలో  ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదు
  • చంద్రబాబు ఓ వైపు సూక్తులు చెబుతున్నారు
  • మరోవైపు తమ అనుచరులతో రాజకీయం చేయిస్తున్నారు
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన సమయంలో ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేయడం తగదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓ వైపు సూక్తులు చెబుతున్న చంద్రబాబు, మరో వైపు తన అనుచరులతో రాజకీయం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు.

గ్రామ వాలంటీర్ల ఆత్మస్థయిర్యం దెబ్బతినేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని, ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడాన్ని సోమిరెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. చంద్రబాబు, పవన్  ల తీరును ఎండగడుతూ ఓ వీడియోను అంబటి విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిపక్షాలు  సహకరించని పక్షంలో దేశద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News