మా వంతుగా మేం సాయం చేస్తున్నాం: విరుష్క
- పీఎం-కేర్ ఫండ్ ను ప్రారంభించిన ప్రధాని
- మా సాయం కొంతవరకైనా ఉపయోగపడుతుంది
- ట్విట్టర్ లో వెల్లడించిన విరాట్ కోహ్లీ
"నేను, అనుష్క పీఎం-కేర్స్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయనిధి (మహారాష్ట్ర)కి మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది పడుతున్న బాధను చూసి మా హృదయాలు చలించిపోయాయి. ఈ మా సహాయం బాధలో ఉన్న వారికి కొంతవరకైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను" అని విరాట్ ట్వీట్ చేయగా, ఇదే ట్వీట్ ను అనుష్క కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.