Ramgopal Varma: లాక్ డౌన్ లో కూడా చాలా ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నాను: రామ్ గోపాల్ వర్మ చమత్కారం

Varma Says he Circleing Many areas in his city
  • కిచర్ పూర్, సోఫా చౌక్, బెడ్ రూమ్ నగర్, డైనింగ్ పేట ఎన్నో ఉన్నాయి
  • తనదైన స్టయిల్ లో వర్మ ట్వీట్
  • కోటి స్వరపరిచిన పాట రీ ట్వీట్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ, తాను చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నానని తనదైన స్టయిల్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "నగరంలోని చాలా ప్రాంతాల్లో నేను తిరుగుతున్నాను. కిచర్ పూర్, సోఫా చౌక్, బెడ్ రూమ్ నగర్, డైనింగ్ పేట, బాల్కనీ కార్నర్, ఫ్రిడ్జ్ స్ట్రీట్, బాత్ రూమ్ సర్కిల్, వాషింగ్ మెషీన్ నగర్, టెలివిజన్ స్టేషన్ అన్నీ తిరిగేస్తున్నాను" అంటూ ఆయన చమత్కారంగా ట్వీట్ చేశారు.

ఆపై సంగీత దర్శకుడు కోటి, కరోనా వైరస్ పై యుద్ధం చేయాలంటూ స్వరపరచగా, చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ తదితరులు నటించగా, తయారు చేసిన పాటను ఆయన రీ ట్వీట్ చేస్తూ, "ఈ మల్టీ స్టార్ సాంగ్ అద్భుతం, మైండ్ బ్లోయింగ్. కరోనా వైరస్ కూడా ఈ పాటను ఇష్టపడుతుంది. నేను నా కరోనా స్పెషల్ సాంగ్ ను ఏప్రిల్ ఫూల్ డే రోజున విడుదల చేస్తున్నాను. ఇక ఎవరు ఫూల్ అవుతారో వైరస్ డిసైడ్ చేస్తుంది" అని అన్నారు.
Ramgopal Varma
Koti
Corona Virus
Song
Chiranjeevi
Nagarjuna

More Telugu News