Chiranjeevi: నీవు ఒక యుద్ధ వీరుడివి: హీరో నితిన్ పై చిరంజీవి ప్రశంసలు 

Chiranjeevi praises Nithin
  • కరోనా నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేసుకున్న నితిన్ 
  • నీ స్ఫూర్తి చాలా గొప్పదన్న చిరంజీవి
  • కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
యంగ్ హీరో నితిన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చిరు స్పందిస్తూ, నితిన్ ను యుద్ధ వీరుడిగా పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యక్రమాల కంటే ప్రజల సేఫ్టీకే ప్రాధాన్యతను ఇచ్చావని కొనియాడారు.

కరోనాపై పోరాటంలో నీ స్ఫూర్తి చాలా గొప్పదని... మన దేశాన్ని ఆ మహమ్మారి కబళించకుండా చేస్తున్న పోరాటంలో నీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. 'నీకు, నీ కాబోయే భార్యకు శుభాకాంక్షలు' అని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రధాని, ఏపీ, టీఎస్ సీఎంల నిధికి నితిన్ 20 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా నేపథ్యంలో తన వివాహాన్ని నితిన్ వాయిదా వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, నితిన్ పై చిరు ప్రశంసలు కురిపించారు.
Chiranjeevi
NIthin
Marriage
Corona Virus
Tollywood

More Telugu News