సీజీహెచ్ఎస్ లబ్దిదారులకు శుభవార్త.. ఒకేసారి మూడు నెలలకు సరిపడే మందులు!
- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి
- లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది లేకుండా నిర్ణయం
- వెల్నెస్ సెంటర్లకు ఆదేశాలు జారీ
ఈ మేరకు ఆయా నగరాల్లోని వెల్నెస్ సెంటర్లకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు సీజీహెచ్ఎస్ వెల్ నెస్ కేంద్రాలను సంప్రదించి మూడు నెలలకు కావాల్సిన మందులను పొందవచ్చని తెలిపింది.