Vijayasai Reddy: ఈ పని చేయండి.. వ్యాక్సిన్లు, మందులతో అవసరం ఉండదు: విజయసాయిరెడ్డి

If we maintain social distance no need of vaccine says Vijayasai Reddy
  • ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలి
  • ఇంటి నుంచి బయటకు రాకుండా సహనాన్ని ప్రదర్శించాలి
  • తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా మన గౌరవాన్ని నిలబెట్టాలి
కరోనా వైరస్ కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. వైరస్ లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్లకు తరలించి చికిత్స అందిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేస్తూ... వారు ఎవరెవరిని కలుసుకున్నారనే వివరాలను సేకరిస్తూ... అందరికీ పరీక్షలను నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ విన్నపం చేశారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించగలిగితే... ఇప్పట్లో వ్యాక్సిన్లు, ఔషధాలతో అవసరమే ఉండదని చెప్పారు. సీఎం జగన్, అధికారుల విన్నపం మేరకు లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇంటి నుంచి బయటకు రాకుండా సహనాన్ని ప్రదర్శించాలని కోరారు. దేశంలోనే అతి తక్కువ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మన గౌరవాన్ని నిలబెట్టాలని విన్నవించారు.
Vijayasai Reddy
Corona Virus
Social Distance
YSRCP

More Telugu News