ప్రభుత్వం చెప్పింది అర్థం చేసుకోండి.. హాస్యనటుడు వడివేలు కన్నీళ్లతో వేడికోలు!
- ప్రభుత్వ ఆంక్షలు బేఖాతరు
- ఇంటి పట్టున ఉండకుండా రోడ్లపైకి జనం
- తేలిగ్గా తీసుకోవద్దంటూ వడివేలు ఆవేదన
వైరస్ ప్రభావం తగ్గేంత వరకు అందరూ కొంతకాలం పాటు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కొందరు బయట తిరుగుతుండడంతో వడివేలు ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వానికి, కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వారికి, పోలీసులకు అందరూ సహకరించాలని కోరాడు. తాజా పరిణామాలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని అన్నాడు. పిల్లాపాపలతో అందరం ఇంట్లోనే ఉందామని, దీనిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.