Beni Prasad Verma: కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ కన్నుమూత

Former union minister Beni Prasad Verma died
  • అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన బేణీప్రసాద్
  • కొంతకాలం కిందటే రాజకీయాలకు దూరం
  • 2011లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా పనిచేసిన బేణీప్రసాద్
కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలోని తన నివాసంలో బేణీప్రసాద్ వర్మ తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు. యూపీఏ హయాంలో 2011లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా పనిచేశారు. తొలినాళ్లలో సమాజ్ వాదీ పార్టీలో కొనసాగిన బేణీప్రసాద్ వర్మ ఆపై కాంగ్రెస్ లో చేరారు. నాలుగేళ్ల కిందట మళ్లీ సమాజ్ వాదీ పార్టీ గూటికి చేరారు. యూపీలోని గోండా లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు.
Beni Prasad Verma
Death
Demise
Samajwadi
Congress

More Telugu News