Corona Virus: గత 24 గంటల్లో 75 కొత్త కేసులు, నలుగురు మృతి: కేంద్రం వెల్లడి

Corona death toll raises to twenty in India
  • దేశవ్యాప్తంగా 10 వేల వెంటిలేటర్ల ఏర్పాటు
  • డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ
  • కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న లవ్ అగర్వాల్
దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు. కాగా, భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 851కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 20 మరణాలు సంభవించాయి.
Corona Virus
positive
Death
India
COVID-19

More Telugu News