Pawan Kalyan: ‘జనసేన’ నాయకుడు అన్యం గోవిందు మృతి పార్టీకి తీరనిలోటు: పవన్ కల్యాణ్

Janasena leader Anyam Govind demise
  • తూర్పుగోదావరి జిల్లా ‘జనసేన’ నాయకుడు అన్యం గోవిందు
  • ఆయన గొప్ప మానవతా వాది, విద్యాదాత, సమాజసేవకుడు
  • నా తరఫున, ‘జనసేన’ శ్రేణుల తరఫున సంతాపం 
జనసేన పార్టీ నాయకుడు అన్యం గోవిందు అకాల మరణం పార్టీకి తీరని లోటని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాదాత, సమాజసేవకులు అయిన గోవిందు మృతి తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు గ్రామానికి చెందిన ఆయన ప్రజల సంక్షేమం కోసం శ్రమించేవారని కొనియాడారు.

గొప్ప మానవతా వాదిగా, విద్యాదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, తన ఇంటిని జనసేన పార్టీ కార్యాలయంగా మార్చి వేసిన ఆయన పార్టీకి చేసిన సేవలు మరువరానివని అన్నారు. గోవిందు కుటుంబ సభ్యులకు తన తరఫున, ‘జనసేన’ శ్రేణుల తరఫున సంతాపం తెలుపుతున్నామని అన్నారు.
Pawan Kalyan
Janasena
Anyam Govind
demise
obtiuary

More Telugu News