Pawan Kalyan: ఏపీ హైకోర్టుకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

Janasena Founder pawan kalyan says Heartfelt thanks to AP High court
  • ఎన్ఓసీలతో  ఏపీకి వచ్చే వారిని అనుమతించాలన్న హైకోర్టు
  • ఈ ఆదేశాలతో హైదరాబాద్ లోని విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువతకు ఊరట 
  • పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణకు అభినందనలు
తెలంగాణ రాష్ట్రం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)లతో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వారిని అనుమతించాలని ఏపీ హైకోర్టు ఆదేశించడం హైదరాబాద్ నగరంలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువతకు ఊరట కలిగిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. వారి ఆందోళనను అర్థం చేసుకున్న హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని, అవసరమైన వారిని క్వారంటైన్, లేని వారిని హోమ్ క్వారంటైన్ చేయాలనే ఆదేశాలను ఏపీకి వస్తున్నవారు గౌరవించాలని సూచించారు. హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, యువత, అక్కడ చిక్కుకుపోయిన వారి బాధకు స్పందించి పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తున్నానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Pawan Kalyan
Janasena
AP High Court
Lockdown
Hyderabad

More Telugu News