RBI: మూడు నెలల రుణ చెల్లింపుల వాయిదా ప్రయోజనం కొద్దిమందికే... ఆర్బీఐ వివరణ!

RBI Gives More Clarity on Three Months Maratorium
  • క్రెడిట్ కార్డులపై రుణాలు చెల్లించాల్సిందే
  • విద్య, వ్యక్తిగత, గృహ రుణాలపైనే మారటోరియం
  • ఉసూరుమన్న క్రెడిట్ కార్డు దారులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలకు ఊరట కలిగించే నిమిత్తం, బ్యాంకులకు రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్ కార్డు బకాయిలు ఉన్నవారు, వివిధ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు తీసుకుని ఈఎంఐలు కడుతున్న వారంతా ఎంతో సంతోషించారు.

వాస్తవానికి రుణాలపై కిస్తీలను మూడు నెలల పాటు చెల్లించకుంటే, సదరు ఖాతాను నిరర్ధక ఆస్తిగా బ్యాంకు పరిగణిస్తుంది. కానీ, ఈ మూడు నెలలూ వాయిదాలు చెల్లించకున్నా, వాటిని ఎన్పీఏలుగా ప్రకటించ వద్దని ఆదేశించింది.

ఇక, కొద్దిసేపటి క్రితం మారటోరియంపై వివరణ ఇచ్చిన రిజర్వ్ బ్యాంకు, క్రెడిట్ కార్డు రుణాలు, బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని పేర్కొంది. ఆ చెల్లింపులను నిబంధనల ప్రకారమే వినియోగదారులు తప్పకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. టర్మ్ లోన్స్ లో భాగంగా ఉండే... అంటే, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు వంటి వాటికి మాత్రమే ఈ కష్టకాలంలో ఊరట లభిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ ప్రకటనతో క్రెడిట్ కార్డుదారులు ఉసూరుమన్నారు.
RBI
Corona Virus
Maratorium
Credit Cards

More Telugu News