Narendra Modi: ఇదో మైలురాయి... నరేంద్ర మోదీని ప్రశంసించిన చంద్రబాబు!

Chandrababu Calls Modi Govt Package is a Milestone
  • భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
  • దేశమున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం
  • ట్విట్టర్ లో నారా చంద్రబాబునాయుడు
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళనను కలిగిస్తున్న వేళ, కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించగా, ప్రధాని నరేంద్ర మోదీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. "నరేంద్ర మోదీ గారు ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మైలురాయి వంటిది. ప్రస్తుతం దేశమున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడి గతంతో పోలిస్తే మరింత బలంగా భారతావని ఎదిగేందుకు ఉపకరిస్తుంది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Narendra Modi
Chandrababu
Package
Corona Virus
Twitter

More Telugu News