Lauras labs: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందజేసిన లారస్ ల్యాబ్స్ సీఈఓ

In the wake of corona virus Laras Labs CEO Donation
  • కరోనా వైరస్ కట్టడి నిమిత్తం విరాళం
  • సీఎంని కలిసిన డాక్టర్ సత్యనారాయణ, చంద్రకాంత్ చేరెడ్డి
  • రూ.50 లక్షల చెక్  అందజేత
కరోనా వైరస్ కట్టడి నిమిత్తం చేసే పోరాటానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు లారస్ ల్యాబ్స్ విరాళం అందజేసింది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ, ఈడీ చంద్రకాంత్ చేరెడ్డి కలిసి రూ.50 లక్షల చెక్ ను అందజేశారు. తమ ల్యాబ్ తరఫున ఒక లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందిస్తున్న ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడటంతో పాటు, వారు చూపిన స్ఫూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందని అన్నారు.
.అలాగే, విశాఖపట్టణం అచ్యుతాపురం సెజ్‌లోని లారస్ ల్యాబ్ కూడా రూ.50 లక్షల విరాళం అందించింది. కంపెనీ మానవ వనరుల విభాగం వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు విశాఖలో కలెక్టర్ వినయ్‌చంద్‌ను కలిసి కంపెనీ తరపున బ్యాంకు డీడీని ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. లారస్ ల్యాబ్ తరఫున ఒక లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను కూడా ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు.
.
Lauras labs
Ceo
Satya Narayana
KCR
cm
Corona Virus
Donation

More Telugu News