Pondugala: గుంటూరు జిల్లా పొందుగల అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్తత

  • తెలంగాణ నుంచి మళ్లీ విద్యార్థుల రాక
  • అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులపై కొందరు యువకుల రాళ్లదాడి
గుంటూరు జిల్లా పొందుగల వద్ద తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ నుంచి మళ్లీ విద్యార్థుల రాక ప్రారంభం కావడంతో పోలీసులను భారీగా మోహరించారు. తెలంగాణ వైపు నుంచి ఎవరూ రాకుండా పోలీసులు కృష్ణా నది వంతెనపై ఇనుపకంచెలు అడ్డుగా వేశారు.

పోలీసులు అడ్డుకోవడంతో కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు కొందరు యువకులకూ గాయాలయ్యాయి. అటు, ప్రత్యేక వైద్య బృందాలు పొందుగల చేరుకున్నాయి. వైద్య పరీక్షలు చేయించుకుని క్వారంటైన్ కు సిద్ధపడిన వారినే ఏపీలోకి అనుమతిస్తున్నారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి పొందుగలలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Pondugala
Guntur District
Andhra Pradesh
Telangana
Corona Virus
Lockdown

More Telugu News