Pawan Kalyan: అన్నా, నన్ను 'సర్' అని పిలవొద్దు... బ్రదర్ అంటే చాలు: పవన్ కు కేటీఆర్ ట్వీట్

KTR wants Pawan to call him a brother instead of sir
  • కేటీఆర్ సర్ అంటూ పవన్ ట్వీట్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్
  • కేటీఆర్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన పవన్
ట్విట్టర్ లో జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. "కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీరు చేస్తున్న కృషి అమోఘం, ఈ సందర్భంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం కేటీఆర్ సర్" అంటూ పవన్ కల్యాణ్ అభినందనపూర్వకంగా ట్వీట్ చేశారు.  

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, తనను అభినందించినందుకు "థ్యాంక్స్ అన్నా!" అంటూ పవన్ కు వినమ్రంగా బదులిచ్చారు. అయితే సర్ అని సంబోధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. "సర్ అంటున్నారు, ఇదెప్పటినుంచి? దయచేసి నన్నెప్పుడూ బ్రదర్ అనే పిలవండి" అంటూ ట్వీట్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ వెంటనే బదులిస్తూ, "అలాగే బ్రదర్" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్లు కాసేపట్లోనే ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. వేల లైకులు, రీట్వీట్లు సొంతం చేసుకున్నాయి.
Pawan Kalyan
KTR
Sir
Brother
Twitter
Corona Virus
Telangana

More Telugu News