KCR: తెలంగాణ సీఎం రీలీఫ్ ఫండ్ కు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన మేఘా సంస్థ

Megha Constructions donates RS 5 crores to TS CM Relief Fund
  • ప్రభుత్వ చర్యలను  ప్రశంసించిన మేఘా సంస్థ
  • ఆపత్కాలంలో సాహసోపేత చర్యలు తీసుకున్నారని కితాబు
  • ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామని లేఖ
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకుగాను తెలంగాణ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు మేఘా ఇంజినీరింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ లిమిటెడ్ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి లేఖ రాశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు.

ఆపత్కాలంలో ప్రజలను రక్షించేందుకు తమరు ఎన్నో సాహసోపేతమైన చర్యలను తీసుకున్నారని ప్రశంసించారు. రాష్ట్ర సరిహద్దులను బంద్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కష్ట కాలంలో ప్రభుత్వానికి మద్దతును తెలియజేస్తున్నామని... తొలి చర్యలో భాగంగా రూ. 5 కోట్లను విరాళంగా అందజేస్తున్నామని తెలిపారు. సామాన్య ప్రజలకు ఆహారం, నీళ్లను సరఫరా చేసేందుకు తమ వంతు చేయూతను అందిస్తామని చెప్పారు.
KCR
TRS
Corona Virus
Megha Constructions
Donation

More Telugu News