Allari Naresh: ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు 'నాంది'!: సినీ నటుడు ‘అల్లరి’ నరేశ్

Artist Allari Naresh announces donation to their Nandi movie unit
  • ‘నాంది’ యూనిట్ లో రోజువారీ వేతన కార్మికులు 50 మంది ఉన్నారు
  • లాక్ డౌన్ వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు పడకూడదు
  • మా నిర్మాత సతీశ్ వేగేశ్న, నేను కలిసి వారికి సాయం అందిస్తాం
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్ డౌన్ ప్రభావం సామాన్య, నిరుపేద కుటుంబాలపై ఆర్థికంగా ఎంతో చూపుతోంది. వారికి అండగా ఉండాలన్న తలంపుతో ఇప్పటికే  పలువురు సెలెబ్రిటీలు తమ ఉదారతను చాటుకుంటూ విరాళాలు ప్రకటించారు. తాజాగా, నటుడు ‘అల్లరి’ నరేశ్ కూడా తన వంతుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అల్లరి నరేశ్ నటిస్తున్న కొత్త చిత్రం 'నాంది'. ఈ చిత్ర యూనిట్ లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే కార్మికులకు ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు.

ఈ 21 రోజుల లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడే వారిలో తమ ‘నాంది’ చిత్ర యూనిట్ లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా కార్మికులు ఉన్నారని, వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలని చూస్తున్నామని అన్నారు. తమ నిర్మాత సతీశ్ వేగేశ్న, తాను కలిసి ఈ యాభై మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు నాంది..’ అంటూ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
Allari Naresh
Tollywood
Nandi
movie Unit
Satish vegesna
producer

More Telugu News