Prabhas: తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన ప్రభాస్

Prabhas donates one crore for AP and Telangana
  • కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వాలు
  • విరాళాలతో స్పందిస్తున్న సెలబ్రిటీలు
  • ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రభాస్ భారీ విరాళం
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో అనేక వ్యవస్థలు స్థంభించిపోయాయి. ప్రభుత్వాలు మాత్రం నిర్విరామంగా కరోనా వ్యతిరేక పోరు సాగిస్తున్నాయి. సెలబ్రిటీలు తమవంతుగా ప్రభుత్వాలకు భారీగా విరాళాలు అందిస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ ఫండ్ లకు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.
Prabhas
Corona Virus
Andhra Pradesh
Telangana
Donation

More Telugu News