Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే ప్రమోషన్

No exam for  6th to 10th class in Andhra Pradesh
  • లాక్ డౌన్ నేపథ్యంలో 6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల రద్దు
  • 10వ తరగతి పరీక్షలపై మార్చి 31న సమీక్ష
  • మధ్యాహ్నం భోజనం విద్యార్థుల ఇళ్లకే పంపించాలని నిర్ణయం
కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను రద్దు చేసింది. ఈ తరగతులకు చెందిన విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారి ఇళ్లకే పంపిస్తామని తెలిపారు. మార్చి 31వ తేదీన సమీక్షను నిర్వహించి 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Andhra Pradesh
6th to 9th
exams
10 class
coron
Lockdown

More Telugu News