విడిపోయిన బాలీవుడ్ జంటను కలిపిన కరోనా!
- 2014లో విడాకులు తీసుకున్న హృతిక్ రోషన్, సుసానే
- లాక్ డౌన్ నేపథ్యంలో ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయం
- సుసానేను ప్రశంసించిన హృతిక్ రోషన్
తమ పిల్లలు హ్రేహాన్, హృదాలతో కలసి ఉండేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని హృతిక్ తెలిపాడు. ఈ 21 రోజులు తామంతా కలిసే ఉంటామని చెప్పారు. సుసానే గత కొన్ని రోజులుగా తమ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోందని తెలిపాడు. పిల్లల పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పాడు. తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ 'నీవు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ సుసానే' అన్నాడు హృతిక్.