'శ్రీకారం' వాయిదాపడే అవకాశం?
- శర్వానంద్ హీరోగా 'శ్రీకారం'
- దర్శకుడిగా కిషోర్ రెడ్డి
- కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్
ఆయన తాజా చిత్రంగా 'శ్రీకారం' రూపొందింది. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 24వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు శర్వానంద్ చేసిన సినిమాల పరాజయం ప్రభావం ఈ సినిమా బిజినెస్ పై పడకుండా వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది.