Chiranjeevi: 'ఆచార్య'కి స్ఫూర్తినిచ్చే పాత్రలో చరణ్?

Acharya Movie
  • చిరూ - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య'
  • సందేశంతో కూడిన వినోదభరిత చిత్రం 
  • నక్సలైట్ పాత్రలో చరణ్

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. వినోదానికి సందేశం జోడించబడిన కథ ఇది. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. దాంతో చరణ్ పాత్ర ఏమిటి? ఈ సినిమాలో ఆయన ఎలా కనిపించనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా చరణ్ పోర్షన్ వస్తుందని అంటున్నారు. ఆయన పాత్ర .. కథను మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. ఆ పాత్ర ఆశయం .. భావజాలం నుంచి 'ఆచార్య' స్ఫూర్తిని పొంది తన పోరాటాన్ని కొనసాగిస్తాడని అంటున్నారు. తెరపై చరణ్ పాత్ర 30 నిమిషాల నిడివి కలిగి ఉంటుందనీ, ఆయన కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News