Corona Virus: మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ భేటీ.. ఒక్కొక్కరి మధ్య మీటరున్నర ఎడం!

government on corona
  • కూర్చోవడంలో సామాజిక దూరం పాటించిన మంత్రులు
  • ప్రధాని మోదీ నివాసంలో కొనసాగుతోన్న సమావేశం
  • కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
కరోనా విజృంభణను అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సామాజిక దూరాన్ని పాటించారు. ఒక్కొక్కరి మధ్య మీటరున్నర ఎడం ఉండేలా కూర్చుని మోదీతో చర్చించారు.

ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో కరోనా సహాయక చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందించే ఏర్పాట్లపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు లాక్‌ చేయొద్దని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
Corona Virus
India
Narendra Modi

More Telugu News