Corona Virus: దేశంలో 562 మందికి కరోనా.. తెలంగాణలో 39 మందికి సోకిన వైనం
- ప్రస్తుతం 512 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స
- కోలుకున్న 50 మంది కరోనా బాధితులు
- భద్రాద్రి కొత్తగూడంలో మరో ఇద్దరికి కరోనా
దేశంలో ఇప్పటివరకు మొత్తం 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ప్రస్తుతం 512 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 50 మంది కరోనా బాధితులు కోలుకున్నారని వెల్లడించింది.
మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం లో పాజిటివ్ వచ్చిన యువకుడితో కలిసి ఉన్న మరో ఇద్దరికి కరోనా వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. భద్రాద్రి కొత్త గూడానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి, మరో వృద్ధురాలికి కరోనా సోకినట్లు వివరించింది. దీంతో తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది.