Tirupati: ఆసుపత్రికి వెళుతున్న వైద్యులను కొట్టిన పోలీసులు... తిరుపతిలో ధర్నా!

Medicos Protest in tirupati
  • ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తుంటే అడ్డుకుంటున్నారు
  • తిరుపతి లీలామహల్ సెంటర్ లో మెడికోల ధర్నా
  • మెడికోలకు సర్దిచెప్పిన ఉన్నతాధికారులు
తాము ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స చేస్తుంటే, పోలీసులు అడ్డుకుంటున్నారని, దారుణంగా తిడుతూ, తమను కొట్టారని ఆరోపిస్తూ, వైద్యులు ధర్నాకు దిగారు. ఈ ఉదయం కొందరు మెడికోలు వెళుతుండగా, అడ్డుకున్న పోలీసులు వారిని ముందుకు కదలనీయలేదని తెలుస్తోంది.

తాము వైద్యులమని ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పినా వినిపించుకోని పోలీసులతో మెడికోలు వాగ్వాదానికి దిగగా, వారిని కొట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని నిరసించిన వైద్యులు స్థానిక లీలామహల్ సెంటర్ లో ధర్నాకు దిగారు. తమపై చెయ్యి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ధర్నా ప్రాంతానికి చేరుకుని, శాఖా పరమైన విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇవ్వడంతో మెడికోలు ధర్నాను విరమించారు.
Tirupati
Medicos
Police
Protest

More Telugu News