Ali: ఇదేమైనా డబ్బు సంపాదించే సమయమా?: హాస్య నటుడు అలీ

Commedian Ali appels to people
  • దేశమంతా ఆందోళనలో ఉంది
  • ఎంత రేటు ఉంటే అంతకే విక్రయించాలి
  • వ్యాపారులకు అలీ వినతి
దేశమంతా వైరస్ వ్యాప్తితో తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో చాలా మంది వ్యాపారులు, నిత్యావసరాలు, కూరగాయల ధరలను పెంచి, డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నారని, ఇది సరికాదని హాస్య నటుడు అలీ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇచ్చిన ఆయన, ఇది సంపాదించే సమయం కాదని, ఎంత రేటు ఉంటే అంతకే అమ్మాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.

దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటూ, తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ వ్యాఖ్యానించారు. ఇటలీలో వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని అలీ కోరారు.
Ali
Corona Virus
Andhra Pradesh
Telangana

More Telugu News