Corona Virus: కరోనాపై నరేంద్ర మోదీ తాజా ట్వీట్లు!

Narendra Modi latest Tweets on Corona Virus
  • వైరస్ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదు
  • ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం
  • ఏకకాలంలో షాపులకు పరుగులు తీయవద్దన్న మోదీ
కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజ్ఞప్తి చేశారు. నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, రాత్రి 11 గంటల సమయంలో ఆయన కొన్ని వరుస ట్వీట్లు చేశారు. "నిత్యావసర వస్తువుల నిమిత్తం షాపుల వద్ద గుమికూడితే, కొవిడ్-19 వ్యాప్తికి కారణమవుతారు. ఏకకాలంలో షాపులకు పరుగులు తీయవద్దు. ఇళ్లలోనే ఉండండి. మీకు కావాల్సిన అన్ని నిత్యావసరాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఆపై "నేటి సాయంత్రం నేను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం అయ్యాను. జాతి ఆరోగ్యం కోసం వారు చేస్తున్న కృషికి నా కృతజ్ఞతలు" అన్నారు. దాని తరువాత, "డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వారి అనుభవాలతో కొవిడ్-19తో పోరాడుతున్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య సంరక్షణ తమ బాధ్యతగా వారు స్వీకరించారు. వారు చేస్తున్న కృషికి భారతావని సెల్యూట్ చేస్తోంది" అని అన్నారు.
Corona Virus
Narendra Modi
Twitter

More Telugu News