Jagan: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM Jagan Ugadi wishes for telugu people
  • రేపు శార్వరీ నామ సంవత్సర ఉగాది
  • ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని సీఎం ఆకాంక్ష
  • కరోనా దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని సూచన
రేపు శార్వరీ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. షడ్రుచుల ఉగాది ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలని అభిలషిస్తున్నట్టు వెల్లడించారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కొన్నాళ్ల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
Jagan
Ugadi
Telugu People
Andhra Pradesh
Corona Virus

More Telugu News