క్రిష్ సినిమాలో పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం?

  • పవన్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్'
  • క్రిష్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం 
  • మే 2వ వారం నుంచి షూటింగ్
పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' రూపొందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై, అభిమానుల్లో అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నాడు. ఇది చారిత్రక నేపథ్యంలో సాగే కథ. ఆంగ్లేయుల కాలంలో ఈ కథ నడుస్తుందట. ఈ కథలో పవన్ .. ఆంగ్లేయులను ఎదిరించే బందిపోటుగా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది.

బందిపోటుగా మాత్రమే కాదు .. మరో విలక్షణమైన పాత్రలోను పవన్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అంటే పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట. పవన్ చేసే మరో పాత్ర ఎలా వుండబోతోంది? ఆ పాత్రను క్రిష్ ఎలా డిజైన్ చేశాడు? ఆ పాత్రలో పవన్ ఎలా కనిపించనున్నాడు? అనేవి ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచే అంశాలనే చెప్పాలి. ఏప్రిల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావలసింది. కానీ కరోనా కారణంగా మే 2వ వారం నుంచి మొదలుకావొచ్చని అంటున్నారు.

Pavan kalyan
Vakeel Saab
krish Movie

More Telugu News