Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేజ్రీవాల్ ప్రకటన

kejriwal on delhi corona cases
  • ఆసుపత్రుల నుంచి ఐదుగురు కరోనా బాధితుల డిశ్చార్జ్‌ 
  • పరిస్థితులు మన చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు. ఢిల్లీలో 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటన చేశారు. కరోనా విజృంభణ అంశం మన చేతుల్లోంచి జారి పోకుండా చేసుకోవడమే అతి పెద్ద సవాలని ఆయన వ్యాఖ్యానించారు.

'ఆసుపత్రుల నుంచి ఐదుగురు కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే, ఇది అంతగా సంతోషపడాల్సిన విషయం కాదు. పరిస్థితులు మన చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి' అని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఢిల్లీ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఢిల్లీలో విదేశీయుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.
Arvind Kejriwal
New Delhi
Corona Virus

More Telugu News