Allu Arjun: ఖరీదైన కార్లను అద్దెకిచ్చే వ్యాపార సంస్థలో షేర్ తీసుకున్న అల్లు అర్జున్!

Allu Arjun started new Business
షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే 'అల వైకుంఠపుములో' చిత్రంతో నాన్ 'బాహుబలి' రికార్డులను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లగ్జరీ కార్లను అద్దెకిస్తున్న ఓ కంపెనీలో అల్లు అర్జున్ 7 శాతం వాటాలను కొనుగోలు చేశాడని సమాచారం.

ఇదే సంస్థలో ఇప్పటికే ఓ ప్రముఖ రాజకీయ నేత కూడా భాగస్వామిగా ఉండగా, ఆయన సలహాతోనే బన్నీ, ఈ వ్యాపారంలోకి వచ్చాడని తెలుస్తోంది. ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే వేళ, వచ్చే సెలబ్రిటీల ప్రయాణానికి ఈ సంస్థ ఖరీదైన కార్లను సరఫరా చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ సినిమా థియేటర్లు, పబ్ ల వ్యాపారంలో ఉన్న బన్నీ, తనకు పెద్దగా పరిచయం లేని కార్ల అద్దె బిజినెస్ లోకి దిగడంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.  
Go Back to Shorts
Allu Arjun
New Business
Car Rent

More Telugu News