ఈ నెల 31 వరకు ఏపీలోని కియా మోటార్స్ ప్లాంట్ మూసివేత

  • దేశంలో పెరుగుతున్న కరోనా ప్రభావం
  • మూతపడుతున్న వాహన తయారీ యూనిట్లు
  • కరోనా దృష్ట్యా ప్లాంట్ మూసివేస్తున్నట్టు కియా వెల్లడి
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో అనేక సంస్థలు కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. తాజాగా వాటి జాబితాలో కియా మోటార్స్ కూడా చేరింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్ మూసివేస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. కియా మోటార్స్ యూనిట్ లో కార్యకలాపాలను ఈ నెల 31 వరకు నిలిపివేస్తున్నట్టు సంస్థ పీఆర్వో శ్యాంసుందర్ వెల్లడించారు. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే హ్యుందాయ్, హీరోమోటాకార్ప్ వంటి బడా సంస్థలు దేశంలో ఉత్పత్తిని నిలిపివేశాయి. ఈ నెలాఖరు తర్వాత పరిస్థితిని సమీక్షించి ఆయా సంస్థలు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

KIA Motors
Anantapur District
Penukonda
Corona Virus
India

More Telugu News