భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు పవన్ కల్యాణ్ స్మృత్యంజలి
- మార్చి 23 ఓ విషాదం దినం అని అభివర్ణించిన పవన్
- దేశం కోసం ఆ ముగ్గురు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారని వెల్లడి
- ఆ యోధులకు ప్రతిరోజు నివాళులు అర్పించాలని పిలుపు
భారతదేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి అమరులయ్యారని, ప్రతి ఒక్క భారతీయుడు ఈ ముగ్గురు యోధులకు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ నివాళులు అర్పించాలని సూచించారు. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వారి త్యాగాల ఫలితమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసైనికుల తరఫున కూడా తాను ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. ఆ మహోన్నత మూర్తులకు అభివందనాలు అంటూ ట్విట్టర్ లో స్పందించారు.