అయ్య బాబోయ్‌.. ఏంటీ ఇంతమంది బుర్రలేని వాళ్లా!: యాంకర్‌ అనసూయ

anasuya about netizens comments
  • నిన్నటి నుంచి ట్విట్టర్‌, ఇన్‌స్టాల్లో కొందరి ఖాతాలు బ్లాక్‌ చేశా
  • చేసీ చేసీ వేళ్లు నొప్పి పెడుతున్నాయంటే నమ్మండి
  • తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న అనసూయ  
తన సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా నెగిటివ్ కామెంట్లు చేస్తోన్న వారిని బ్లాక్‌ చేస్తున్నానని యాంకర్ అనసూయ తెలిసింది. 'నిన్నటి నుంచి ట్విట్టర్‌, ఇన్‌స్టాల్లో కొందరి ఖాతాలు బ్లాక్‌ చేసీ చేసీ వేళ్లు నొప్పి పెడుతున్నాయంటే నమ్మండి.. తప్పదు కదా? నా పేజ్‌లో వాళ్ల బుర్రలేనితనం ఏంటీ? నా శాంతి నా బాధ్యత' అని తెలిపింది.

'నన్ను అర్థం చేసుకోని వాళ్లని నేను అర్థం చేసుకోని వారికి సాయం చేస్తున్నాను.. ఎలాగంటే వారిని దూరంగా ఉంచుతున్నాను' అని అనసూయ చెప్పింది. 'అయ్య బాబోయ్!! ఏంటీ ఇంతమందా? ఇంత మంది బుర్రలేని వాళ్లా? ఇంత మంది వితండవాదులా? ఏం చేస్తాం లేండీ' అని అనసూయ పేర్కొంది. తాను చేసిన ఓ ట్వీట్‌ను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని కామెంట్లు చేస్తున్నారని మండిపడింది.
Go Back to Shorts
anasuya
Tollywood
Twitter

More Telugu News