Chandrababu: 'జనతా కర్ఫ్యూ' నేపథ్యంలో ఇంట్లో చంద్రబాబు, దేవాన్ష్ ఏం చేస్తున్నారో వీడియో చూడండి!
- వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు
- మనవడికి పుస్తకం చదివి వినిపిస్తోన్న టీడీపీ అధినేత
- అందరూ ఇంట్లోనే ఉండాలని పిలుపు
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 'జనతా కర్ఫ్యూ' కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు దొరికిన ఈ సమయాన్ని ఇంట్లో తన మనవడు దేవాన్ష్ తో గడుపుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు పోస్ట్ చేశారు. దేవాన్ష్‌కు ఓ పుస్తకం చదివి వినిపిస్తున్నానని తెలిపారు. మన క్షేమం కోసం మనం ఇంట్లోనే ఉండాలన్నారు. మనకు దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పారు.