Anushka Shetty: 'నిశ్శబ్దం'లో వైవిధ్యం చూపించే షాలినీ పాండే!

Nishabdham Movie
  • అనుష్క చుట్టూ అల్లుకున్న కథ 
  •  సోనాలి పాత్రలో షాలినీ పాండే 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
అనుష్క తాజా చిత్రంగా 'నిశ్శబ్దం' రూపొందింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రధారి కాగా, ఇతర ముఖ్య పాత్రల్లో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే కనిపించనున్నారు.

ఈ సినిమాలో అనుష్క స్నేహితురాలు 'సోనాలి' పాత్రలో షాలినీ పాండే కనిపించనుంది. ఆమె పాత్ర అనుమానాస్పదంగా ఉంటుందనీ, ఆమె పాత్రనే కథలో కీలకంగా నిలుస్తుందని తెలుస్తోంది. షాలినీ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని అంటున్నారు. షాలినీ పాండేకి వైవిధ్యభరితమైన రోల్ పడిందనీ, నటన పరంగా ఇది తనని తాను నిరూపించుకునే పాత్ర అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
Anushka Shetty
Madhavan
Shalini Pandey

More Telugu News