ఫ్రెండ్స్ పంపే మెసేజ్ ల ద్వారా పుకార్ల గురించి తెలుసుకుంటాను: అనుష్క
- పుకార్లను పట్టించుకోనన్న అనుష్క
- రూమర్లు రాసేవారికి అక్కాచెల్లెళ్లు, పిల్లలు ఉండరా? అంటూ ఆగ్రహం
- తనకెప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని వెల్లడి
తన విషయంలోనే కాదని, సినీ పరిశ్రమలోనే రూమర్లు సర్వసాధారణమని అన్నారు. తనపై వచ్చే రూమర్లను పట్టించుకోనని అనుష్క స్పష్టం చేశారు. ఇక, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేనని, అయితే తనకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు.