England: నాకు కరోనా సోకింది... చికిత్స పొంది కోలుకున్నా: స్కాట్లాండ్ క్రికెటర్ మజీద్ హక్

scotland cricketer suffered with corona
  • ట్విట్టర్‌లో స్వయంగా పోస్టింగ్ 
  • ఇంగ్లండ్ లోని స్కాట్లాండ్ జట్టు తరపున సేవలు 
  • గ్లాస్గోలోని అలెగ్జాండ్రియా ఆసుపత్రిలో చికిత్స

పాకిస్థాన్ దేశీయుడైన ఇంగ్లండ్ (స్కాట్లాండ్) క్రికెటర్ మజీద హక్ తనకు కరోనా వైరస్ సోకిందని, గ్లాస్గోలోని అలెగ్జాండ్రియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. స్కాట్లాండ్ జట్టుకు ఆఫ్ స్పిన్నర్ గా సేవలందించిన మజీద్ 2006-15 మధ్య అంతర్జాతీయ క్రికెట్ లో 54 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. 2015 ప్రపంచకప్ తో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ప్రస్తుతం స్కాట్లాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 

'కరోనా పాజిటివ్ అని తేలాక ఆసుపత్రిలో చేరాను. అక్కడి సిబ్బంది చాలా బాగా చూసుకున్నారు. ప్రస్తుతం కోలుకోవడతో డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళుతున్నాను. నా ఆరోగ్యంపై వాకబు చేస్తూ మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా' అంటూ ట్విట్టర్ లో మజీద్ పేర్కొన్నాడు.

England
scotland
Cricket
mazid huck
Twitter

More Telugu News