Mahesh Babu: రేపు సాయంత్రం ఐదు గంటలకు.. చప్పట్ల ధ్వని ప్రతిధ్వనించాలంతే: మహేశ్‌బాబు

Tollywood super star Maheshbabu tweets about janata curfew
  • జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపు
  • ప్రధాని పిలుపును అభిమానుల్లోకి తీసుకెళ్తున్న సెలబ్రిటీలు
  • మనం కొట్టే చప్పట్లలో గౌరవం ఉట్టిపడాలన్న మహేశ్‌బాబు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభిస్తోంది. మోదీ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జనతా కర్ఫ్యూను పాటించాలని పలువురు సెలబ్రిటీలు అభిమానులను కోరుతున్నారు. ప్రధాని పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా, ఈ కోవలోకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా చేరాడు.

రేపు ఉదయం ఏడు గంటల నుంచి  రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు శాల్యూట్ చేద్దామని అన్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలని, మనం వారికిచ్చే గౌరవం వాటిలో కనిపించాలని అన్నాడు. ప్రధాని పిలుపును అందరూ పాటించాలని, కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని మహేశ్‌బాబు పిలుపునిచ్చాడు.
Mahesh Babu
Corona Virus
Janata Curfew
Narendra Modi

More Telugu News