Tamilisai Soundararajan: ‘రాజ్​ భవన్​’ లో కూడా ‘జనతా కర్ఫ్యూ’ నిర్వహిస్తాం: గవర్నర్​ తమిళిసై

Tamilisai says We will also conduct Janata curfew in Rajbhavan
  • 22న రాజ్ భవన్ లో కూడా ‘జనతా కర్ఫ్యూ’ నిర్వహిస్తాం
  • రాజ్ భవన్ లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాం
  • తెలంగాణలో ఎవరికీ ఈ వైరస్ సోకలేదు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన ప్రజలు స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. 22న రాజ్ భవన్ లో కూడా ‘జనతా కర్ఫ్యూ’ నిర్వహిస్తామని చెప్పారు. రాజ్ భవన్ లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ‘కరోనా’ వ్యాపించిందని, తెలంగాణలో ఎవరికీ ఈ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్య పరిచేందుకు ‘కరోనా’పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Tamilisai Soundararajan
Telangana
Governor
Janata Curfew

More Telugu News