Shooting: సినిమా షూటింగుల నిలిపివేత మార్చి 31 వరకు పొడిగింపు

Closure of Film Shootings and Screenings in AP and Telangana extended
  • మార్చి 21వరకు షూటింగుల నిలిపివేత అంటూ ఇంతక్రితం ప్రకటన
  • గత నిర్ణయంపై తాజాగా సమీక్షించిన ఫిలిం చాంబర్
  • తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా నిర్ణయం

కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమాల చిత్రీకరణ, ప్రదర్శనల నిలిపివేత మార్చి 31 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజుల కిందట హైదరాబాద్ ఫిలింనగర్ లోని కార్యాలయంలో సమావేశమైన ఫిలిం చాంబర్ పెద్దలు షూటింగులు, చిత్ర ప్రదర్శనలను మార్చి 21 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే, కరోనా అంతకంతకు పెరుగుతుండడంతో తాజాగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం చాంబర్ కార్యవర్గం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరికొన్నిరోజుల్లో మరోసారి సమావేశమై పరిస్థితిపై తాజా సమీక్ష నిర్వహిస్తామని ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News